బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి పెను ముప్పులా మారుతోంది. ఇది రాబోయే సమయంలో ‘అర్నాబ్’ అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం, ఈ తుఫాన్ కాకినాడ – నర్సాపురం మధ్య కోనసీమ ప్రాంతం గుండా తీరం దాటేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. గంటకు 140 కి.మీ.