Scrap Shop Explosion: నగరంలోని రామంతాపూర్ చర్చ్ కాలనీ పరిధిలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్క్రాప్ వ్యాపారి తీవ్రంగా గాయపడగా, దుకాణంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చర్చ్ కాలనీలోని స్క్రాప్ దుకాణంలో డీలర్ పరశురామ్ లోహపు వ్యర్థాలను కట్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పాటు దుకాణమంతటా నిమిషాల.