Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మందాన డకౌట్‌గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న మందాన.. నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ డకౌట్‌తో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో భారత ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరింది. ఆమె ఇప్పటివరకు 5 సార్లు డకౌట్.