Jr NTR: సినిమా రంగంలో ఎంత పెద్ద స్టార్ హీరోలైనా తమకు నచ్చిన దర్శకులు, సంగీత దర్శకులతో ఎంతో చనువుగా ఉంటారు. అలాంటి సరదా ముచ్చటే ఇప్పుడు బయటకు వచ్చి నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్లకు జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఫోన్ చేసి ఫన్నీగా క్లాస్ పీకిన సంగతిని తాజాగా తమన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాకి త్రివిక్రమ్.