ఆకాశంలో అకస్మాత్తుగా ఎలాంటి శబ్దం లేకుండా, ఏ మాత్రం పొగ వదలకుండా.. గంటకు ఏకంగా 1,800 మైళ్ల వేగంతో దూసుకెళ్లే అంతుచిక్కని వస్తువులు కనిపిస్తే ఎలా ఉంటుంది? అదీ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా రహస్య సైనిక స్థావరాల పైభాగంలో ఈ వింత ఆకారాలు ప్రత్యక్షమైతే.. అది మామూలు విషయం కాదు! ఇప్పుడు అమెరికా ఆకాశంలో ప్రత్యక్షమైన బ్లాక్ ట్రయాంగిల్స్ ఆ దేశ ప్రభుత్వాన్ని, రక్షణ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ ‘బ్లాక్ ట్రయాంగిల్స్’.